News February 22, 2025

GOOD NEWS.. నెలకు రూ.7500?

image

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.

Similar News

News July 9, 2025

షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

image

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

News July 9, 2025

పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్: రోజా

image

AP Dy.CM పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో EVM ప్రభుత్వం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక EVM CM. APలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా EVMను ఆరు నెలలు భద్రపరుస్తారు. కానీ APలో మాత్రం 10 రోజులకే నాశనం చేయాలంటూ జీవో జారీ చేస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

News July 9, 2025

ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

image

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.