News July 10, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 10, బుధవారం
చవితి: ఉదయం 6.36 గంటలకు
మఖ: ఉదయం 09.55 గంటలకు
వర్జ్యం: సాయంత్రం 06.43-08.28 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.37-12.30 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00- 01.30 గంటల వరకు

Similar News

News October 4, 2024

రుణమాఫీపై సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే: KTR

image

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని కేటీఆర్ విమర్శించారు. ‘20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. ఓవైపు DEC 9న ఏకకాలంలో చేస్తామని దగా. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. అనధికారికంగా ఇంకా రుణమాఫీ కాని రైతులెందరో? సీజన్ ముగిసినా రైతుబంధు ఇవ్వలేదు. రాబందుల ప్రభుత్వంతో రైతులకేం లాభం’అని ట్వీట్ చేశారు.

News October 4, 2024

నస్రల్లా భావి వారసుడే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు

image

బీరుట్‌లోని హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ వైపు గ్రౌండ్ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే లెబనాన్ వ్యాప్తంగా ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించింది. మరణించిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫియుద్దీన్ టార్గెట్‌గా ఈ భీకర దాడులు జరిగినట్టు తెలిసింది. అతడు బతికున్నాడో లేదో రెండు వర్గాలూ అధికారికంగా ప్రకటించలేదు.

News October 4, 2024

కొండా సురేఖను వదిలేది లేదు: అఖిల్

image

మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.