News July 31, 2024
శుభ ముహూర్తం
✒ తేది: జులై 31, బుధవారం
✒ ఏకాదశి: మధ్యాహ్నం 3.55 గంటలకు
✒ రోహిణి: ఉదయం 10.12 గంటలకు
✒ వర్జ్యం: మధ్యాహ్నం 3.51 నుంచి సాయంత్రం 5.27 వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.48 నుంచి మధ్యాహ్నం 12.39 వరకు
✒ రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు
Similar News
News October 8, 2024
పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల
AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
News October 8, 2024
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు
TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
News October 8, 2024
మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున
TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.