News August 14, 2024
శుభ ముహూర్తం
✒ తేది: ఆగస్టు 14, బుధవారం
✒నవమి: ఉదయం 10.23 గంటలకు
✒అనూరాధ: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒వర్జ్యం: సాయంత్రం 5.57 గంటల నుంచి 7.36 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.46 నుంచి 12.37 గంటల వరకు
Similar News
News September 15, 2024
రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం కీలక ప్రకటన
TG: రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తాడిచెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని విమర్శించారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
News September 15, 2024
రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
News September 15, 2024
కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ
AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.