News September 1, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 01, ఆదివారం
చతుర్దశి: తె.5.22 గంటలకు
ఆశ్లేష: రాత్రి 9.48 గంటలకు
వర్జ్యం: ఉ.9.36-ఉ.11.20 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.40-సా.5.29 గంటల వరకు
రాహుకాలం: సా.4.30-సా.6.30 గంటల వరకు
Similar News
News September 12, 2024
సీతారాం ఏచూరి హైదరాబాద్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందంటే?
సీతారాం ఏచూరి బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లోనే ఆయన టెన్త్ వరకు చదివారు. 1969లో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవ్వడంతో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులు కాకినాడ వాస్తవ్యులు. అందుకే ఆయనకు హైదరాబాద్, TG, APతో అనుబంధం ఎక్కువే. ఈ కారణంతోనే ఎందరో తెలుగువారిని మార్క్సిస్టు పార్టీకి చేరువ చేశారు. జాతీయ నేతలుగా తీర్చిదిద్దారు. TG ఉద్యమంపై ఆయనకెంతో అవగాహన ఉంది.
News September 12, 2024
ఏచూరి.. చట్టసభలో సామాన్యుల గొంతుక
అనారోగ్యంతో <<14084560>>కన్నుమూసిన<<>> సీపీఎం దిగ్గజం సీతారాం ఏచూరి సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. తొలిసారి ఆయన 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఏచూరి చట్టసభలో సామాన్యుల పక్షాన గొంతెత్తారు. ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించేవారు. ప్రస్తుత కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఏచూరికి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు.
News September 12, 2024
23 దంతాలు తొలగించి 12 ఇంప్లాంట్ చేశారు.. చివరికి!
సాధారణంగా ఒక్క దంతాన్ని తొలగించి మరొకటి ఇంప్లాంట్ చేసిన నొప్పినే భరించడం కష్టం. కానీ, చైనాకు చెందిన హువాంగ్ సమ్మతితో 23 దంతాలను తీసివేసి 12 దంతాలను ఇంప్లాంట్ చేయడంతో చనిపోయారు. చికిత్స తర్వాత హువాంగ్ నిరంతరం తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆపరేషన్ పూర్తయిన 13 రోజుల తర్వాత గత నెల 28న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.