News October 17, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 17, గురువారం
పౌర్ణమి: సాయంత్రం 4.56 గంటలకు
రేవతి: సాయంత్రం 4.20 గంటలకు
వర్జ్యం: ఉదయం 7.13 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.55-10.42 గంటల వరకు,
మధ్యాహ్నం 2.36-3.23 గంటల వరకు
Similar News
News November 4, 2024
సిరాజ్ మియా.. ఇలా అయితే కష్టమే!
టెస్టుల్లో టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. 2023 నుంచి అతడు 16 టెస్టులు ఆడగా 34 వికెట్లు మాత్రమే తీశారు. విదేశాల్లో 5 టెస్టుల్లో 21 వికెట్లు తీయగా, సొంతగడ్డపై మాత్రం పూర్తిగా నిరాశ పరిచారు. 11 టెస్టుల్లో కేవలం 13 వికెట్లే పడగొట్టారు. ఆస్ట్రేలియాలో జరగనున్న BGT సిరీస్‌కూ సిరాజ్ ఎంపికయ్యారు. అందులో రాణించకపోతే ఈ హైదరాబాదీ పేసర్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
News November 4, 2024
విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలపై కీలక ప్రకటన
AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. దీంతో ఒక్కో యూనిట్‌కు 0.40 పైసలు సర్దుబాటు ఛార్జీలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ఈ ట్రూఅప్ ఛార్జీలపై ఈ నెల 19లోగా అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలంది.
News November 4, 2024
ప్రతి న్యూడ్ పెయింటింగ్ అశ్లీలం కాదు: బాంబే HC
ప్రతి నగ్న పెయింటింగ్ అశ్లీలమైనది కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రఖ్యాత భారతీయ కళాకారులు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, అక్బర్ పదమ్‌సీల 7 చిత్రాలను విడుదల చేయాలని కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. ‘అసభ్యకరం’ అనే కారణంతో ఆ కళాకృతులను జప్తు చేసిన అధికారులను హెచ్చరించింది. మైఖేలాంజెలో చెక్కిన నగ్న శిల్పం ఇండియాలోకి వచ్చినపుడు దానికి బట్టలు వేయాలని ఇండియన్ కస్టమ్స్ చట్టాలు చెప్పలేదని గుర్తు చేసింది.