News October 18, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 18, శుక్రవారం
బ.పాడ్యమి: మధ్యాహ్నం 1.15 గంటలకు
అశ్వని: మధ్యాహ్నం 1.26 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.55-11.19 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.22-9.08 గంటల వరకు,
మధ్యాహ్నం 12.15-1.02 గంటల వరకు

Similar News

News November 2, 2024

ఈ యాప్ SBIది కాదు.. నమ్మకండి: PIB

image

నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందిన రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకునేందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని SBI పంపినట్లుగా APK ఫైల్‌తో కూడిన మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇవాళే ఇన్‌స్టాల్ చేస్తే రూ.9,980 పొందొచ్చని మెసేజ్ సారాంశం. అయితే దీనికి SBIకి సంబంధం లేదని PIB ఫ్యాక్ట్‌చెక్ పేర్కొంది. ఇలాంటివి SBI పంపించదని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని అవగాహన కల్పించింది. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

News November 2, 2024

బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి: అసదుద్దీన్

image

బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవి చెబితే ఎవరూ తట్టుకోలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. అహంకారంతోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. మేం కాంగ్రెస్‌తో జత కట్టామని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ గతంలో మా మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు కదా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 2, 2024

‘అమరన్’ టీమ్‌ను అభినందించిన సూపర్ స్టార్

image

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ‘అమరన్’ సినిమా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని వీక్షించి మేకర్స్‌ను అభినందించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీని చక్కగా చూపించారని మెచ్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిని నిర్మించినందుకు కమల్ హాసన్‌ను కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పారు.