News November 4, 2024
శుభ ముహూర్తం
✒ తేది: నవంబర్ 4, సోమవారం
✒ తదియ: రాత్రి 11.24 గంటలకు
✒ అనూరాధ ఉ.8.03 గంటలకు
✒ వర్జ్యం: మ. 2.03-3.46 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.12.13-12.59 గంటల వరకు
✒ తిరిగి మ.2.31-3.17 గంటల వరకు
Similar News
News December 14, 2024
రాష్ట్రంలో 9లక్షల కేసులు పెండింగ్
AP: రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ MP పుట్టా మహేశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఏపీ హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.
News December 14, 2024
ఆ జిల్లాలకు వర్ష సూచన
AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
News December 14, 2024
BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
చంచల్‌గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది.