News March 24, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 24, ఆదివారం
శుద్ధ చతుర్దశి: ఉదయం 09:55 గంటలకు
పుబ్బ: ఉదయం 07:33 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:38-05:27 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03:41-17:29 గంటల వరకు

Similar News

News September 7, 2024

ఆ మాటలతో అతని మెంటాలిటీ బయటపడింది: బజరంగ్ పునియా

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.

News September 7, 2024

చవితి శుభాకాంక్షలు తెలిపిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స్వతహాగా భారతీయుడు కాకపోయినా ఇక్కడి రీల్స్, సినీతారల స్టెప్స్ వేస్తూ వార్నర్ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆయన ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News September 7, 2024

ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారికి గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ జూ.కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలోని 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా 80వేల మంది ఫస్టియర్‌లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్‌మెంట్ చేస్తోంది.