News October 13, 2024

పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలివే..

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.

Similar News

News November 2, 2024

సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?

image

వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.

News November 2, 2024

బీజేపీ రెబ‌ల్స్‌కు శివ‌సేన‌, ఎన్సీపీ టిక్కెట్లు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో 16 మంది BJP రెబ‌ల్స్‌కు శివ‌సేన, NCP టిక్కెట్లు కేటాయించాయి. టిక్కెట్లు పొందని BJP నేత‌లు ఆ పార్టీని వీడి మ‌హాయుతి మిత్ర‌ప‌క్షాలైన శివ‌సేన, NCPలో చేరారు. ఈ 16 మందిలో 12 మందికి షిండే, న‌లుగురికి అజిత్ టిక్కెట్లు క‌ట్ట‌బెట్టారు. దీంతో బీజేపీ రెబల్స్ వల్ల మ‌హాయుతికి న‌ష్టం క‌ల‌గ‌కుండా మిత్ర‌పక్షాలు త‌మ వైపు తిప్పుకున్నాయి. అయితే, వారిని BJPనే పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

News November 2, 2024

నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

image

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1950: ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జననం
✒ 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం