News February 10, 2025
మంచి మాట – పద్యబాట

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివ పూజ వ్యర్థాలే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
Similar News
News March 28, 2025
IPL: పాపం కావ్య

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 28, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ పబ్లిక్ టాక్

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో విడుదలైంది. సినిమాలో డైలాగ్స్, కామెడీ బాగున్నాయని, లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. యూత్ ఆడియన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు. అక్కడక్కడ సాగదీతగా, బోరింగ్ ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ
News March 28, 2025
ముస్లింలందరూ నల్ల బ్యాండ్ ధరించాలి: AIMPLB

వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా ముస్లింలందరూ ఇవాళ శాంతియుత నిరసన చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పిలుపునిచ్చింది. జుముఅతుల్-విదా రోజున (రంజాన్ నెలలో చివరి శుక్రవారం) మసీదులకు వచ్చేటప్పుడు చేతికి నల్ల బ్యాండ్ ధరించాలని పేర్కొంది. ఢిల్లీ, పట్నాలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈనెల 29న విజయవాడలో నిరసనకు దిగనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.