News November 12, 2024

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై?

image

AP: ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి, పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం తనను విస్మరించిందని ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన ఈయన 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరారు.

Similar News

News December 9, 2024

గ్రూప్-2 వాయిదాకు ఆదేశించలేం: హైకోర్టు

image

TG: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పరీక్షకు వారం రోజుల ముందు తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గ్రూప్-2, RRB పరీక్షలు ఒకే రోజు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలని పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల కావడం గమనార్హం.

News December 9, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది.

News December 9, 2024

ఆయన కంటే మహానటుడు ఎవరున్నారు?: మంత్రి సత్యప్రసాద్

image

AP: జగన్ కంటే మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అరాచక పాలన సాగించి ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలు చెప్పి హామీలు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌‌ది అని విమర్శించారు. విద్యావ్యవస్థను దారిలో పెట్టి ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.