News January 24, 2025
రాజకీయాలకు గుడ్ బై: విజయసాయిరెడ్డి

AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు.
Similar News
News November 19, 2025
అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 19, 2025
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్ ఇష్యూస్ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్&డైలాగ్ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News November 19, 2025
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

AP: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలుస్తోంది.


