News January 24, 2025

రాజకీయాలకు గుడ్ బై: విజయసాయిరెడ్డి

image

AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్‌తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు.

Similar News

News February 13, 2025

ఒంగోలు ఆవుకు రూ.41 కోట్లు.. సీఎం స్పందనిదే

image

ఒంగోలు జాతి గిత్తలు, ఆవులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఆ జాతికి చెందిన వయాటినా-19 అనే ఆవు <<15364444>>రూ.41 కోట్లు<<>> పలకడం శుభపరిణామమన్నారు. దీనివల్ల రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. ఆ జాతి గిత్తలు ఉన్నతమైనవని, బలానికి ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు.

News February 13, 2025

మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI

image

మార్చి 31వ తేదీన దేశంలోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

News February 13, 2025

చిరంజీవి మనవడి కామెంట్స్‌పై SKN ట్వీట్

image

తనకు ఒక మనవడు కావాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంలో తప్పేముందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత SKN దీనిపై ట్వీట్ చేశారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేసి శునకానందం పొందడం కొందరికి అలవాటు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!