News November 2, 2024
వచ్చే ఏడాది గూగుల్ ఆండ్రాయిడ్ 16 విడుదల!
షెడ్యూల్ కంటే ముందే గూగుల్ ఆండ్రాయిడ్ 16 విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2025లో రెండు రిలీజ్‌లు ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది క్యూ2లో ప్రధాన రిలీజ్‌ను, క్యూ4లో మైనర్ అప్‌డేట్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. పూర్తి సిస్టం అప్‌డేట్ అవసరం లేకుండా ప్రాజెక్ట్ ట్రెబుల్, మెయిన్‌లైన్ వంటి ఇనిషియేటివ్స్‌తో ద్వారా కొత్త అప్‌డేట్స్ సులభంగా యూజర్లకు అందించే ఏర్పాట్లు చేస్తోంది.
Similar News
News December 9, 2024
జమిలి ఎన్నికలు: ఈ సమావేశాల్లోనే బిల్లు!
జమిలి ఎన్నికల నిర్వహణకు NDA ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే సభ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
News December 9, 2024
RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేపథ్యం
RBI గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ IAS అధికారి. IIT కాన్పూర్‌లో Graduation, Princeton University నుంచి పబ్లిక్ పాలసీలో Masters చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలోనూ పని చేశారు. రాజస్థాన్‌లో విద్యుత్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సంస్కరణలకు పునాది వేశారు. ఆర్థిక సేవలు, ఎనర్జీ, IT, మైనింగ్, Taxation రంగాల్లో ఆయనకు 33 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.
News December 9, 2024
స్ట్రెస్ సర్వే.. ‘YES’ అన్నవారిని తొలగించారు!
ఎలాంటి ఉద్యోగమైనా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. యూపీలోని ‘YES MADAM’ అనే కంపెనీ ఉద్యోగులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అనే దానిపై సర్వే నిర్వహించింది. కంపెనీలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నామని బదులిచ్చారు. వారికి HR నుంచి టెర్మినేషన్ మెయిల్ రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ‘హెల్తీ ఎన్విరాన్మెంట్ అందించడానికి మీ అభిప్రాయాలు పరిశీలిస్తాం. అయితే ఒత్తిడి ఉందన్నవారిని తొలగిస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది.