News May 24, 2024
తమిళనాడులో గూగుల్ పెట్టుబడులు

తమిళనాడులో గూగుల్ పిక్సల్ పెట్టుబడులు పెడుతున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా డ్రోన్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను గూగుల్ నెలకొల్పనుంది. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీపెరంబదూర్‌లో ఈ యూనిట్ స్థాపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో TN మంత్రుల బృందం గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. గూగుల్ ఎంత మేర పెట్టుబడులు పెట్టనుందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2025
తొలి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు: శివ కార్తికేయన్

తన లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని తమిళ హీరో శివకార్తికేయన్ వెల్లడించారు. ‘నాది వన్ సైడ్ లవ్. అప్పటికే ఆమెకు లవర్ ఉన్నాడు. దూరం నుంచే చూస్తూ ప్రేమించా. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్‌లో కనిపించింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని వివాహమాడింది. నాకు దొరకని అమ్మాయి ఆ వ్యక్తికీ దొరకలేదు’ అని నవ్వుతూ చెప్పారు.
News February 13, 2025
అన్‌లిమిటెడ్ పానీపూరీ.. ఎక్కడంటే?

వినోదాన్ని పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నట్లుగానే పానీపూరీ తినేందుకు ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం అన్‌లిమిటెడ్ పానీపూరీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఒకేసారి డబ్బు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ తీసుకున్నవారు ఏ సమయంలోనైనా షాప్‌కి వచ్చి పానీపూరీ తినొచ్చని తెలిపాడు. గతంలోనూ బాహుబలి పానీపూరీ పేరుతో ఆయన క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించారు.
News February 13, 2025
వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.