News November 22, 2024
కాపీరైట్ కేసుల్లో గూగుల్-ఒరాకిల్ ప్రత్యేకం

కాపీరైట్ కేసుల్లో అతిపెద్దదిగా గూగుల్, ఒరాకిల్ సంస్థల కేసును చెబుతుంటారు. ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసేందుకు గూగుల్ తమ 11వేల లైన్ల కోడ్‌ను కాపీ చేసిందని ఒరాకిల్ 9 బిలియన్ డాలర్లకు దావా వేసింది. దీనిని గూగుల్ సైతం న్యాయస్థానం ముందు ఒప్పుకొంది. ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో దశాబ్దంపాటు కొనసాగగా, న్యాయపోరాటంలో గూగుల్ గెలిచింది. ఒరాకిల్‌కు చెందిన Java APIని ఉపయోగించడం న్యాయమైనదేనని స్పష్టం చేసింది.
Similar News
News December 11, 2025
అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.
News December 11, 2025
తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్‌ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
ఓవర్‌స్పీడ్‌తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్‌లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.


