News November 22, 2024
కాపీరైట్ కేసుల్లో గూగుల్-ఒరాకిల్ ప్రత్యేకం
కాపీరైట్ కేసుల్లో అతిపెద్దదిగా గూగుల్, ఒరాకిల్ సంస్థల కేసును చెబుతుంటారు. ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసేందుకు గూగుల్ తమ 11వేల లైన్ల కోడ్‌ను కాపీ చేసిందని ఒరాకిల్ 9 బిలియన్ డాలర్లకు దావా వేసింది. దీనిని గూగుల్ సైతం న్యాయస్థానం ముందు ఒప్పుకొంది. ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో దశాబ్దంపాటు కొనసాగగా, న్యాయపోరాటంలో గూగుల్ గెలిచింది. ఒరాకిల్‌కు చెందిన Java APIని ఉపయోగించడం న్యాయమైనదేనని స్పష్టం చేసింది.
Similar News
News December 11, 2024
పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఓడించగలం కానీ.: అమెరికా
చైనాను ఓడించడం తమకు సాధ్యమేనని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ స్పష్టం చేశారు. కానీ సాంకేతికంగా డ్రాగన్‌పై తమకున్న పైచేయి క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్షిపణి టెక్నాలజీ, సమాచార వ్యవస్థలపై US ప్రధానంగా దృష్టి సారించాలి. సైబర్ దాడుల్ని తట్టుకునేలా ఆ సమాచార వ్యవస్థ ఉండాలి. క్షిపణులకు చాలా ఖర్చవుతోంది. పోరాటాల్లో వాటి బదులు డ్రోన్లను వాడాలి’ అని పేర్కొన్నారు.
News December 11, 2024
STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవా..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వొచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. గిఫ్ట్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,678 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిఫ్టీ నిరోధం 24,678, మద్దతు 24,510 వద్ద ఉన్నాయి. STOCKS TO WATCH: ఆఫిస్ స్పేస్, IOB, HG INFRA, LTIM, SAAKSHI MEDTECH, ASIAN PAINTS, MOREPEN LAB, NTPC GREEN.
News December 11, 2024
త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
AP: ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు రాష్ట్రంలో ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వగా 12 స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.15లక్షలు కాగా, లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్లకు లైసెన్సులిస్తారు. కనీసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.