News June 7, 2024

లొకేషన్ హిస్టరీని డిలీట్ చేయనున్న గూగుల్

image

యూజర్లు తిరిగిన లొకేషన్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. యూజర్ల పర్సనల్ డేటాను స్టోర్ చేయడం తగ్గిస్తామని గత ఏడాది ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపడుతోంది. లొకేషన్ డేటాను సేవ్ చేసే టైమ్‌లైన్ ఫీచర్‌ ఇకపై యూజర్లు సెలక్ట్ చేసుకుంటేనే పనిచేస్తుందని తెలిపింది. అయితే ఆ డేటా కూడా కంపెనీ సర్వర్లలో స్టోర్ కాదని, కేవలం యూజర్లలో ఫోన్లలోనే స్టోర్ అవుతుందని స్పష్టం చేసింది.

Similar News

News September 11, 2025

ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.

News September 11, 2025

నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

image

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.

News September 11, 2025

ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందిస్తాం’ అని ట్వీట్ చేశారు.