News September 23, 2024

Google To Nvidia: 15 టెక్ కంపెనీల CEOలతో మోదీ మీటింగ్

image

గూగుల్, Nవిడియా, అడోబి సహా 15 టెక్ కంపెనీల CEOలను PM మోదీ MITలో కలిశారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయో టెక్నాలజీ రంగాలపై చర్చించారు. హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎకానమీని టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్చిందన్నారు. మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతున్న భారత్‌లో ఇన్నోవేషన్‌కు అనువైన వాతావరణం ఉందన్నారు. దీనిని క్యాపిటలైజ్ చేసుకోవాలన్న తన సూచనకు CEOలు సానుకూలంగా స్పందించారని ట్వీట్ చేశారు.

Similar News

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.

News October 7, 2024

భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.

News October 7, 2024

గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన

image

INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.