News May 19, 2024
గూస్ బంప్స్ గ్యారంటీ: దేవర టీమ్
Jr.NTR బర్త్ డే కానుకగా ‘దేవర’ నుంచి ఇవాళ రాత్రి 7:02 గంటలకు ‘ఫియర్ సాంగ్’ రానుంది. ఈ పాటలోని ప్రతీ లైన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని మూవీ టీమ్ తెలిపింది. గేయ రచయితలు బ్లేడ్‌లాగా ప్రతి లైన్‌ను చెక్కుతూ రాశారని పేర్కొంటూ రచయితల పేర్లను వెల్లడించింది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో విష్ణు ఏడవన్, హిందీలో మనోజ్ ముంతాషిర్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో ఎం.గోపాలకృష్ణన్ రచించినట్లు పేర్కొంది.
Similar News
News December 13, 2024
రాజ్యసభకు ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఉపఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో రాజ్యసభకు వీరి ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికైన అభ్యర్థులు శుక్రవారం ఆర్వో నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గవ్వల భరత్ తదితరులు సన్మానించారు.
News December 13, 2024
శుభవార్త చెప్పిన ప్రభుత్వం
AP: కర్నూలు(D) పత్తికొండ మార్కెట్‌లో రూ.1కి పడిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. లాభ నష్టాలు లేకుండా కిలో రూ.8కి మార్కెటింగ్ శాఖ కొనాలని ఆదేశించారు. APలోని మార్కెట్లలో కూడా అదే ధరకు విక్రయించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు నాసిరకం పంట అందుబాటులోకి రావడంతో సాధారణ టమాటాపై ప్రభావం పడిందని అధికారులు, రైతులు పేర్కొన్నారు.
News December 13, 2024
పుష్కరాల్లో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?: RGV
అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పోలీసులకు RGV 4 ప్రశ్నలు వేశారు. ‘పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్‌ను అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?’ అని ప్రశ్నించారు.