News April 11, 2025
గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News April 20, 2025
మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.
News April 20, 2025
మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్‌మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.
News April 20, 2025
రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <