News April 8, 2025
రొయ్యల ధరలు తగ్గించొద్దని ప్రభుత్వం సూచన

AP: అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది. 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. USA సుంకాలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 11 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని ఆక్వా రైతులు, భాగస్వాములు, వ్యాపారులతో భేటీలో CM CBN వెల్లడించారు.
Similar News
News October 17, 2025
14,582 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL)-2025 టైర్-1 పరీక్ష ప్రాథమిక కీని SSC విడుదల చేసింది. అభ్యర్థులు https://ssc.gov.in/ వెబ్సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 19 వరకు కీపై అభ్యంతరాలను తెలపవచ్చు. 14,582 పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు, అక్టోబర్ 14న ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 13.5 లక్షల మంది హాజరయ్యారు.
News October 17, 2025
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
News October 17, 2025
509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.