News April 8, 2025

రొయ్యల ధరలు తగ్గించొద్దని ప్రభుత్వం సూచన

image

AP: అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది. 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. USA సుంకాలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 11 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని ఆక్వా రైతులు, భాగస్వాములు, వ్యాపారులతో భేటీలో CM CBN వెల్లడించారు.

Similar News

News April 17, 2025

రూ.10.75 కోట్ల ప్లేయర్.. బెంచ్‌కే పరిమితం

image

IPL: గత ఐదేళ్లు SRHకు కీలక బౌలర్‌గా ఉన్న నటరాజన్‌ను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఆక్షన్‌లో DC రూ.10.75 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసినా బెంచ్‌కే పరిమితం చేస్తోంది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటరాజన్ గత సీజన్‌లోనూ 19 వికెట్లతో సత్తాచాటారు.

News April 17, 2025

మేము హిందూస్ కానీ.. హిందీస్ కాదు: రాజ్ ఠాక్రే

image

జాతీయ భాష కాని హిందీని ప్రాథమిక తరగతిలోనే నేర్చుకోవాల్సిన అవసరమేముందని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్రలో NEPని అమలు చేయడాన్ని సహించేది లేదని ట్వీట్ చేశారు. తామంతా ‘హిందూస్ కానీ.. హిందీస్ కాదు’ అన్నారు. NEPని అమలు చేస్తే పోరాటం జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. మరాఠీ, నాన్ మరాఠీ ప్రజల మధ్య గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని భావిస్తుందని ఆయన ఆరోపించారు.

News April 17, 2025

వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

image

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

error: Content is protected !!