News July 11, 2024
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ప్రకటన

దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. UIDAI నెట్‌వర్కింగ్ ఢిల్లీలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని ప్రభావం తెలంగాణపైనా పడింది. దీంతో ఆధార్ ఆధారిత OTP సేవలు, రిజిస్ట్రేషన్స్ వంటి సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో గురువారం నిలిచిపోయిన సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News February 19, 2025
ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు ఆందోళన

ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.
News February 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్
News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.