News July 22, 2024

‘RSSకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగులు’.. బ్యాన్ తొలగించిన కేంద్రం!

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడటంపై గతంలో అమలు చేసిన నిషేధాన్ని NDA ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. ఈనెల 9న ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్న పోస్ట్‌ను షేర్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇకపై బ్యూరోక్రసీ సైతం ఆ సంస్థ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు.

Similar News

News February 6, 2026

మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

image

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.

News February 6, 2026

స్మృతి.. వాట్ ఏ ఛాంపియన్

image

కొన్ని రోజుల క్రితమే ప్రియుడితో అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దయ్యి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు క్రికెటర్ స్మృతి మంధాన. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరిగినా ఆమె పట్టించుకోలేదు. తిరిగి కొన్ని రోజులకే బ్యాట్ పట్టారు. శ్రీలంకతో సిరీస్‌‌లో ఫర్వాలేదనిపించినా WPLలో ఆర్సీబీ సారథిగా సత్తా చాటారు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఫైనల్లో POTMగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకున్నారు.

News February 6, 2026

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)