News November 19, 2024

ప్రభుత్వ ప్రోత్సాహం.. ఒక్కరోజే 131 ఈవీల కొనుగోలు

image

TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.

Similar News

News October 22, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in/

News October 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 43

image

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 22, 2025

సౌదీలో ‘కఫాలా’ రద్దు.. ఏంటో తెలుసా?

image

సౌదీ అరేబియాలో 1950ల నుంచి ‘కఫాలా’ సిస్టమ్ అమల్లో ఉంది. పాస్‌పోర్టును యజమానికి సమర్పించడం, ఇంటికి వెళ్లాలన్నా, జాబ్ మారాలన్నా కచ్చితంగా పర్మిషన్ తీసుకోవడం, న్యాయ సహాయం లేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఒకరకంగా చెప్పాలంటే విదేశీ కార్మికులను బానిసలుగా చూసేవాళ్లు. సంస్కరణల్లో భాగంగా సౌదీ యువరాజు ఇటీవల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో 1.3 కోట్ల మంది విదేశీ కార్మికులకు ఊరట కలగనుంది.