News December 19, 2024

ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునేవారికి అనుమతులు సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 24, 2025

ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన

image

దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.

News January 24, 2025

గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు

image

TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.

News January 24, 2025

దిల్‌ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

image

TG: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఐటీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజు‌తో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఆయన తల్లి అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.