News November 14, 2024
కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS
AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Similar News
News December 8, 2024
తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం
ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచులో 34-32 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌లో విజయ్ 11 పాయింట్లు సాధించారు. ఈ గెలుపుతో TT ఖాతాలో 10 విజయాలు చేరాయి. దీంతో నాలుగో స్థానానికి చేరింది.
News December 8, 2024
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అక్కడి పార్టీలు జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధ్యక్షుడి సైనిక పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ను తొలగించేందుకు అధికార పీపుల్స్ పవర్ పార్టీ (PPP), విపక్ష డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే శనివారం ఓటింగ్ సందర్భంగా PPP సభ్యులు అనూహ్యంగా బాయ్‌కాట్ చేయడంతో తీర్మానం వీగిపోయింది.
News December 7, 2024
అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?
రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.