News February 5, 2025
భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు

AP: భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. 300చ.మీ. మించని నిర్మాణాలకు యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకే ఈ వెసులుబాటు కల్పించింది.
Similar News
News January 22, 2026
డ్రాగన్ ఫ్రూట్ కాపు వేగంగా రావాలంటే..

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నర్సరీల్లో మొక్కే అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ మధ్యే పంట కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క నుంచి.. 3-4 అడుగుల కొమ్మను తీసుకొని నవంబర్, డిసెంబర్‌లో నాటాలి. ఇలా చేస్తే మొక్క నాటిన 6 నెలల్లోనే పూత, కాయలు వచ్చి, మంచి యాజమాన్యం పాటిస్తే వచ్చే డిసెంబర్ నాటికి కనీసం 2 టన్నుల దిగుబడి వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు, అధిక దిగుబడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News January 22, 2026
IITRలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్(IITR) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు LMV&HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా.. డ్రైవర్ పోస్టుకు 27ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: csiriitrprograms.in
News January 22, 2026
వసంత పంచమి ఎందుకు జరుపుకొంటారు?

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంతి పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వాగీశ్వరి జయంతి’గా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ ఇది.


