News March 25, 2024

టెట్ ఫీజు తగ్గించేందుకు ప్రభుత్వం యోచన?

image

TG: టెట్ ఒక్కో పేపర్ ఫీజును రూ.300 నుంచి రూ.1,000కి <<12907253>>పెంచడంపై<<>> అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, హాస్టళ్లకు రూ.వేలు ఖర్చు పెడుతున్న తమపై ఫీజుల భారం వేయడం తగదని, వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. ఫీజు పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని CMO వర్గాలు ఆయనకు చెప్పాయట. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 6, 2026

APPLY NOW: BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 12వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI ఉత్తీర్ణులై, పనిఅనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ₹ 295. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: www.becil.com

News January 6, 2026

నేటి నుంచి మలేషియా ఓపెన్

image

గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్లు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే మలేషియా ఓపెన్‌ సూపర్ 1000 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక, ఉన్నతీ హుడా, డబుల్స్‌లో పుల్లెల గాయత్రీ-ట్రీసా జాలీ, మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ పోటీ పడనున్నారు. అక్టోబర్ తర్వాత సింధు ఆడుతున్న టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి.

News January 6, 2026

బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

image

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్‌కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.