News May 21, 2024
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి: హరీశ్ రావు

TG: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరు నెలలు వృథా చేశారని.. ఇప్పటికైనా మేడిగడ్డ పనులు మొదలుపెట్టాలని కోరారు. మేడిగడ్డ వదిలేసి సుందిళ్ల, అన్నారంలో రిపేర్లు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం విడ్డూరమన్నారు.
Similar News
News March 12, 2026
దేశం సంక్షోభంలో.. మోదీ టూర్‌లో: ఖర్గే

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ తరుణంలో PM మోదీ ఎన్నికల టూర్ చేపడుతున్నారని విమర్శించారు. ‘దేశవ్యాప్తంగా LPG కొరత ఉంది. ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు. దౌత్యపరంగా విఫలమవడం చాలా తీవ్రమైన అంశం. ఎనర్జీ మిస్‌మేనేజ్‌మెంట్ ఫలితాన్ని 140 కోట్ల మంది అనుభవిస్తున్నారు’ అని ఖర్గే పోస్ట్ చేశారు.
News March 12, 2026
ఇంటర్ పూర్తయిందా?.. ఓ లుక్కేయండి!

<<19343753>>ఇంటర్<<>> పూర్తయినవారు రెగ్యులర్ కోర్సులకే పరిమితం కాకుండా క్రియేటివిటీతో కూడిన డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ ఉన్నవారు డిజైన్ (NID/NIFT) కోర్సుల ద్వారా రాణించవచ్చు. పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో హోటల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంది.
News March 12, 2026
కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.


