News November 3, 2024
చిన్నారి కుటుంబానికి అండగా ప్రభుత్వం
AP: తిరుపతి జిల్లా వడమాలపేటలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును మంత్రి అనిత అందజేశారు. అలాగే వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఆమె ధైర్యం చెప్పారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2024
ప్చ్.. రోహిత్ మళ్లీ ఫ్లాప్
టెస్టుల్లో రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆయన 3 పరుగులకే ఔటయ్యారు. గత 11 ఇన్నింగ్స్‌లలో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3 రన్స్ చేసి నిరాశపరిచారు. వీటిలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉండటం గమనార్హం. హిట్‌మ్యాన్ ఇకనైనా ఫామ్ అందుకోవాలని, లేదంటే టీమ్‌లో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 6, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగ్రా’ మూవీ
వాసన్ బాల డైరెక్షన్‌లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’ ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఓ అక్రమ కేసులో తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే పాత్రలో ఆలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
News December 6, 2024
గుండె గూటిలో ‘మినీ బ్రెయిన్’!
గుండెలో సొంత నరాల వ్యవస్థ ఉందని, దానినే మినీ బ్రెయిన్‌గా పిలుస్తారని కొలంబియా యూనివర్సిటీ కొత్త స్టడీ తెలిపింది. గుండె లయ నియంత్రణలో దీనిదే కీలక పాత్రని పేర్కొంది. ఇన్నాళ్లూ నరాల వ్యవస్థ ద్వారా మెదడు పంపించే సంకేతాలు పొంది పనిచేస్తుందన్న భావనను ఈ స్టడీ సవాల్ చేసింది. హృదయ కుడ్యాల్లోని సంక్లిష్ట న్యూరాన్స్ నెట్‌వర్క్‌ను గుర్తించింది. మనిషిని పోలిన గుండె కలిగిన జీబ్రాఫిష్‌ను ఈ టీమ్ స్టడీచేసింది.