News December 2, 2024
హరీశ్ రావుకు ప్రభుత్వ విప్ కౌంటర్
TG: బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ఆగం చేసిందన్న <<14767666>>హరీశ్ రావు కామెంట్లపై<<>> ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఆగం చేసిందని, సూరత్ నుంచి నాసిరకం చీరలు తెప్పించారని మండిపడ్డారు. వాటిని పంటకు రక్షణకు ఉపయోగించారే తప్ప మహిళలు కట్టుకోలేకపోయారన్నారు. బీసీలకు BRS అనుకూలమా? కాదా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదని దుయ్యబట్టారు.
Similar News
News January 13, 2025
పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు
హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.
News January 13, 2025
యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.
News January 13, 2025
మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత
AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.