News September 8, 2024
రిపేర్ల ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది: చంద్రబాబు
AP: విజయవాడ వరద బాధితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రిపేర్లు చేపించేలా చర్యలు తీసుకుంటామని CM చంద్రబాబు తెలిపారు. అందుకయ్యే ఖర్చుని అవసరమైతే ప్రభుత్వమే సబ్సిడీ లేదా పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ‘ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నవాళ్లు సర్వం కోల్పోయారు. బాధితులను ఏ రకంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం’ అని CBN చెప్పారు.
Similar News
News October 5, 2024
రేపు ఢిల్లీకి రేవంత్.. సీఎంల భేటీకి హాజరు
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 5, 2024
టీ20 WC: భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 WCలో నిన్న కివీస్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా -2.900 NRRతో గ్రూప్-Aలో చివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగతా 3 మ్యాచులు (PAK, SL, AUS) గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ సాధించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బలమైన AUS టీమ్ ఎలాగో SFకి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్ SF చేరాలంటే AUS మినహా మిగతా 3 జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి NRR మనకంటే తక్కువుండాలి.
News October 5, 2024
హృతిక్, ఎన్టీఆర్‌తో సాంగ్ షూట్.. అప్పుడేనా?
జూ.ఎన్టీఆర్ ఈనెల 9 నుంచి ‘వార్-2’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈనెల మూడో వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో ఒక సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.