News September 16, 2024
వైద్య రంగంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.5వేల కోట్లతో ప్రతిపాదనలు!

TG: వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న పలు కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹4,944కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ట్రామాకేర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది.
Similar News
News March 26, 2026
రేపు సెలవు

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.
News March 26, 2026
ఇరాన్‌పై విరుచుకుపడండి.. నెతన్యాహు ఆదేశం

అమెరికా-ఇరాన్ డీల్ పూర్తి కాక ముందే ఇరాన్‌పై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)ను ఆదేశించారు. ఇరాన్ ఆయుధ ఇండస్ట్రీలను 48 గంటల్లో నాశనం చేయాలని బంకర్ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్ నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది.
News March 26, 2026
‘ఖర్గ్’ స్వాధీనానికి US ప్లాన్.. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

ఇరాన్‌కు చెందిన <<19378419>>ఖర్గ్ ద్వీపాన్ని<<>> స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు CNN తెలిపింది. దీంతో ఇరాన్ అప్రమత్తమై భారీ ఎత్తున బలగాలను సిద్ధం చేస్తోందని పేర్కొంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ సైతం స్పందించారు. ‘మా పక్క దేశంతో కలిసి శత్రువులు కుట్ర చేస్తున్నారు. అన్నీ గమనిస్తున్నాం. వాళ్లు అటాక్ చేస్తే ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తాం’ అని హెచ్చరించారు.


