News September 16, 2024

వైద్య రంగంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.5వేల కోట్లతో ప్రతిపాదనలు!

image

TG: వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న పలు కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹4,944కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ట్రామాకేర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది.

Similar News

News October 10, 2024

సైలెంట్‌గా ఉన్నందుకు క్షమించండి: షకీబ్

image

బంగ్లా మాజీ PM హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు తాను మద్దతుగా నిలవనందుకు క్షమించాలని ఆ దేశ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ నెల 21న ఢాకాలో సౌతాఫ్రికాతో జరిగే తన ఆఖరి టెస్టుకు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. ‘నియంతృత్వ వ్యతిరేక నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. హసీనా పార్టీ తరఫునే ఆయన ఎంపీ కావడం గమనార్హం.

News October 10, 2024

Q2 ఆదాయంపై ప్రెస్‌మీట్ రద్దు చేసిన TCS

image

రతన్ టాటా కన్నుమూయడంతో తమ ద్వితీయ త్రైమాసిక ఆదాయాన్ని వివరించేందుకు నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, అదే సమయానికి రతన్ అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి.

News October 10, 2024

కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా

image

TG: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా పేర్కొన్నారు. పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇప్పటికే సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.