News July 12, 2024
అమరావతి కట్టడాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
Similar News
News December 6, 2025
బిగ్బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

తెలుగు బిగ్బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్తో క్లారిటీ రానుంది.
News December 6, 2025
మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.
News December 6, 2025
MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.


