News March 31, 2025

ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అంద‌రిపై ఆయన దీవెనలు ఉండాల‌ని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

ములుగు: కొత్త ఎస్పీకి “మేడారం” సవాల్..!

image

ములుగు జిల్లా ఎస్పీగా నియమితులైన సుధీర్ రాంనాథ్ కేకన్‌కు మేడారం మహా జాతర రూపంలో సమీప దూరంలోనే సవాల్ ఎదురైంది. అయితే ఆయన గతంలో ములుగు ఏఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో ఓ మహా జాతర, మినీజాతర ఏర్పాట్లలో ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారు. అప్పటి అనుభవం జనవరిలో జరిగే పెద్ద జాతరలో ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈసారి జాతరలో పోలీస్ చర్యలకు సంబంధించి కసరత్తు జరగగా ఈ ప్రణాళిక కేకన్‌కు హెల్ప్ అవుతుంది.

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లతో ప్రయోజనాలు..

image

✧ నేటి నుంచి <<18350734>>అమల్లోకి<<>> వచ్చిన లేబర్ కోడ్లతో 7వ తేదీలోపే వేతనం
✧ పురుషులతో సమానంగా మహిళలకు శాలరీ, రాత్రి పనిచేసే అవకాశం
✧ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు గుర్తింపు.. PF, ESIC, ఇన్సూరెన్స్, OT చేసే కార్మికులకు డబుల్ పేమెంట్
✧ ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ
✧ 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత హెల్త్ చెకప్
✧ ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత

News November 21, 2025

పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

image

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.