News June 28, 2024

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్

image

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.

Similar News

News September 18, 2025

మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

image

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.

News September 18, 2025

HLL లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్ 25 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఫార్మసీ, ఎంబీఏ, బీఈ, బీటెక్, పీజీడీఎం‌తో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com/

News September 18, 2025

త్వరలో US టారిఫ్స్‌ ఎత్తివేసే ఛాన్స్: CEA

image

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్‌ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్‌కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.