News March 21, 2024

కర్ణాటక సర్కారుకు గవర్నర్ షాక్!

image

కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో షాక్ తగిలింది. హిందూ దేవాలయాలపై పన్ను విధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తిప్పిపంపారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు ఇదే తరహా పన్ను వర్తింపు ఉందా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత అవసరమని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నల్ని అనుసరించి బిల్లును సవరించాలని సూచించారు.

Similar News

News November 10, 2025

రూ.50లక్షల కోట్లకు.. ‘మ్యూచువల్’ ఇండస్ట్రీ

image

దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త మైలురాయిని దాటింది. అక్టోబర్ నాటికి ఈక్విటీ అండర్ కస్టడీ ఆస్తుల విలువ ₹50లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది FEBలో విలువ ₹39.21 లక్షల కోట్లుగా ఉండగా ఏకంగా 30% వృద్ధి నమోదయ్యింది. మార్చి 2020లో నెలకు ₹8,500 కోట్లుగా ఉన్న SIPలు SEP 2025 నాటికి ₹29,361 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల రిటైల్ పెట్టుబడిదారులలో విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

News November 10, 2025

అందెశ్రీ మృతిపై కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ సంతాపం

image

ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం KCR, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని KCR అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆకాంక్షించారు.

News November 10, 2025

పచ్చిపాలతో ముఖానికి మెరుపు

image

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.