News March 21, 2024
కర్ణాటక సర్కారుకు గవర్నర్ షాక్!

కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో షాక్ తగిలింది. హిందూ దేవాలయాలపై పన్ను విధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తిప్పిపంపారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు ఇదే తరహా పన్ను వర్తింపు ఉందా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత అవసరమని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నల్ని అనుసరించి బిల్లును సవరించాలని సూచించారు.
Similar News
News November 19, 2025
బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.
News November 19, 2025
సేవలు – ధరలు – ఇతర వివరాలు

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.
News November 19, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.


