News January 26, 2025

జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

image

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండాను ఎగురవేశారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2025

ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయి: YCP

image

AP: చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై దాడి చేయించారని ఆరోపించింది. 83 ఏళ్ల వ్యక్తి అని కూడా చూడకుండా తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేశారని ట్వీట్ చేసింది. మరీ ఇంత నీచ రాజకీయాలా చంద్రబాబు? అని ప్రశ్నించింది.

News February 16, 2025

తెలుగు రాష్ట్రాల్లో IPL మ్యాచ్‌లు ఎన్ని ఉన్నాయంటే?

image

IPL-2025లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 11 మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ స్టేజ్‌లో SRH 7 మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ కూడా HYDలో జరగనున్నాయి. అలాగే, ఢిల్లీ జట్టు రెండో హోం వెన్యూగా విశాఖపట్నాన్ని ఎంచుకుంది. దీంతో మార్చి 24న లక్నోతో, 30న SRHతో వైజాగ్‌లో ఢిల్లీ తలపడనుంది. IPLలో మీ ఫేవరెట్ టీమ్ ఏదో COMMENT చేయండి.

News February 16, 2025

చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు

image

AP: చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లే వారి రక్షణ దృష్ట్యా TTD ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉ.5 నుంచి మ.2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తోంది. అనంతరం 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.

error: Content is protected !!