News July 3, 2024

ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

TG: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జులై 5 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు.

Similar News

News March 26, 2026

హార్ముజ్ భారత్‌కు తెరిచే ఉంటుంది: ఇరాన్ విదేశాంగ మంత్రి

image

హార్ముజ్ ఇండియాకు తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని తెలిపింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.

News March 26, 2026

ఓటర్ల జాబితా ప్రచురణకు గడువు పొడిగింపు

image

AP: గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణకు SEC నీలం సాహ్ని APR 15 వరకు గడువు పొడిగించారు. టెక్నికల్ సమస్యలున్నందున 4 వారాలు గడువు ఇవ్వాలని అధికారులు కోరగా తొలుత అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం కలెక్టర్ల నుంచి మరింత సమాచారాన్ని సేకరించి సమర్పించడంతో ఒప్పుకున్నారు. మరోవైపు సర్పంచ్‌ల పదవీకాలం APR 2తో ముగియనుండటంతో ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 26, 2026

ఇళ్లు, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలుసా?

image

దేశంలోని ఆలయాలు, ఇళ్లలో దాదాపు 50వేల టన్నుల గోల్డ్ ఉంటుందని పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం సభ్యుడు PP చౌదరి వెల్లడించారు. దీనివిలువ ₹942L Crగా అంచనా వేశారు. దీని ఫైనాన్షియలైజేషన్‌ను మరింత పెంచితే బులియన్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు. కానీ గోల్డ్‌ను మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.