News July 3, 2024

ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

TG: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జులై 5 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు.

Similar News

News December 9, 2024

విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

image

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News December 9, 2024

సివిల్స్ ఫలితాలు విడుదల

image

సివిల్స్-2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC రిలీజ్ చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1,056 పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది.

News December 9, 2024

తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారిస్తే చట్టపరమైన చర్యలు: సీఎం

image

TG: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.