News July 27, 2024
ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచబోతోంది: హరీశ్
TG: ఎక్సైజ్ శాఖలో బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం బీర్లు, మద్యం ధరలు భారీగా పెంచబోతున్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గత బడ్జెట్‌లో BRS ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి రూ.19,884 కోట్ల ఆదాయాన్ని ఆశించగా.. కాంగ్రెస్ సర్కార్ రూ.25,617 కోట్ల రాబడిని టార్గెట్‌గా పెట్టుకుందన్నారు. బీర్లపై రూ.3,500 కోట్లు, మద్యంపై రూ.15,500 కోట్లకు డ్యూటీని పెంచిందని వెల్లడించారు.
Similar News
News December 12, 2024
బిగ్‌బాస్-8 గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్?
బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ మెగా ఈవెంట్‌కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్‌కు ఆయనే ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. ఇవాళో, రేపో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు టాప్-5 ఫైనలిస్ట్స్‌లో అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారని మీరనుకుంటున్నారు?
News December 12, 2024
BITCOIN: 24 గంటల్లో ₹3.82 లక్షల ప్రాఫిట్
క్రిప్టోమార్కెట్లు నిన్న జోరుప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ $4500 (Rs 3.82L) లాభపడింది. మళ్లీ $1,01,125 వద్ద ముగిసింది. నేడు మాత్రం $450 నష్టంతో $1,00,676 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $2.02Tను టచ్ చేసింది. ఇక డామినెన్స్ 55%గా ఉంది. గత 24 గంటల్లో ETH 6, XRP 5, SOL 6, BNB 7, DOGE 8, ADA 10, TRON 7, AVAX 12, SHIB 9% మేర పెరగడం విశేషం.
News December 12, 2024
‘పుష్ప-2’: రేవతి మృతికి బాధ్యులెవరు?
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో <<14796361>>రేవతి<<>> చనిపోగా ఆమె కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. రేవతి మృతితో తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం అల్లు అర్జున్ కూడా ఇదే కారణం చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం తను వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందనడం సరికాదని, తనపై కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరు?