News September 23, 2024
ప్రభుత్వం పిరికిపంద చర్యలు ఆపాలి: BRS
TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.
Similar News
News October 9, 2024
కాంగ్రెస్ ‘రిజెక్ట్’ స్టేట్‌మెంట్లపై ECI సీరియస్: ఖర్గేకు ఘాటు లేఖ
EVMలపై నిందలేస్తూ, హరియాణా ఫలితాలను అంగీకరించడం లేదన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ECI ఘాటుగా స్పందించింది. ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వం కలిగిన ఈ దేశంలో ఇలాంటి జనరలైజ్ స్టేట్‌మెంట్లను ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖరాసింది. ఇది ప్రజాతీర్పును అప్రజాస్వామికంగా తిరస్కరించడమేనని స్పష్టం చేసింది. INC 12 మంది సభ్యుల బృందాన్ని 6PMకు కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.
News October 9, 2024
BRS ఇక అధికారంలోకి రాదు: రేవంత్
TG: బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాబోదని సీఎం రేవంత్ అన్నారు. ‘పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాం. డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయి. తెలంగాణ సమాజం మీద కేసీఆర్‌కు ఎందుకంత కోపం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News October 9, 2024
‘RC16’లో రామ్ చరణ్ లుక్ ఇదేనా?
బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘RC16’లో రామ్ చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. క్రీడాప్రధానంగా సాగే ఈ కథలో చెర్రీ ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్‌లో ఉంది. ఈరోజు VV వినాయక్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విష్ చేశారు. గడ్డంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ లుక్‌లో చరణ్ మరో హిట్ కొడతారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.