News June 12, 2024

టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం

image

TG: టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ టెట్ <<13426430>>ఫలితాలు<<>> వెలువడిన సంగతి తెలిసిందే.

Similar News

News February 8, 2026

రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

image

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.

News February 8, 2026

సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

image

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.

News February 8, 2026

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం