News September 1, 2024
IMD హెచ్చరికలు పట్టించుకోకుండా ఐపీఎస్లపై ప్రభుత్వం కక్ష సాధింపు: YCP

AP: రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తాయని ఆగస్టు 29నే IMD హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం రివ్యూ చేయలేదని వైసీపీ ఆరోపించింది. ఒక సినీ నటి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై బురదజల్లుడు, ఐపీఎస్లపై వేధింపులు, కక్షసాధింపు కార్యక్రమాల్లో బిజీగా ఉందని మండిపడింది. సీఎం ఉదాసీనతతో భారీ వర్షాలను మంత్రులు పట్టించుకోలేదని, యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా ఉందని Xలో దుయ్యబట్టింది.
Similar News
News October 17, 2025
కావేరి నదీ ఎలా పుట్టిందంటే?

పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని కుమార్తె అయిన కావేరిని, కావేర ముని దత్తత తీసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న అగస్త్య మహాముని, దైవ చర్చలలో మునిగి, ఆమెను నిర్లక్ష్యం చేశాడు. దీంతో అసహనానికి గురైన ఆమె అగస్త్య ముని స్నానపు తొట్టిలో పడిపోయింది. అనంతరం కావేరి నదిగా జన్మించింది. ప్రజలకు మేలు చేయాలనే తన లక్ష్యాన్ని కావేరి ఇలా నేరవేర్చుకుంది. కార్తీక మాసంలో ఈ నదిలో స్నానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
News October 17, 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, B.Ed ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ కమ్ గార్డనర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు. వెబ్సైట్: https://centralbank.bank.in/
News October 17, 2025
ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్: IMD

దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని IMD వెల్లడించింది. దీంతో ఏపీ, TN, కేరళ, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, కేరళ, మాహే వాతావరణ సబ్డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే AP, తమిళనాడు, కేరళల్లో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపటిలోపు అల్పపీడనంగా ఏర్పడి, 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందంది.