News September 1, 2024

IMD హెచ్చరికలు పట్టించుకోకుండా ఐపీఎస్‌లపై ప్రభుత్వం కక్ష సాధింపు: YCP

image

AP: రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తాయని ఆగస్టు 29నే IMD హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం రివ్యూ చేయలేదని వైసీపీ ఆరోపించింది. ఒక సినీ నటి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీపై బురదజల్లుడు, ఐపీఎస్‌లపై వేధింపులు, కక్షసాధింపు కార్యక్రమాల్లో బిజీగా ఉందని మండిపడింది. సీఎం ఉదాసీనతతో భారీ వర్షాలను మంత్రులు పట్టించుకోలేదని, యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా ఉందని Xలో దుయ్యబట్టింది.

Similar News

News September 14, 2024

రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు: సర్ఫరాజ్

image

బాలీవుడ్ సినిమా లగాన్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర తరహాలో రోహిత్ శర్మ నిజజీవితంలో ఉంటారని క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. జట్టులో అందర్నీ గౌరవంతో చూస్తారని పేర్కొన్నారు. ‘రోహిత్ చాలా విభిన్నమైన వ్యక్తి. మేం చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలాంటి మనిషి. కొత్త కుర్రాళ్లను కూడా తనతో సమానంగానే ట్రీట్ చేస్తారు. ఆయన కెప్టెన్సీలో ఆడటాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నాం’ అని తెలిపారు.

News September 14, 2024

‘టైమ్’ బెస్ట్ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్

image

2024లో ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాను టైమ్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన 8 సంస్థలకు అందులో చోటు దక్కింది. స్టాటిస్టాతో కలిసి 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్ పేర్కొంది. పని పరిస్థితులు, జీతం, సమానత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. కాగా.. ఉద్యోగుల పట్ల తమ నిబద్ధత, వ్యాపార రంగంలో దక్షతకు ఇది నిదర్శనమని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.

News September 14, 2024

హ్యాపీ బర్త్ డే ‘SKY’

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు నేడు. 1990 సెప్టెంబర్ 14న ఆయన ముంబైలో జన్మించారు. 2021లో 30 ఏళ్ల వయసులో SKY అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అద్భుత ఆటతీరుతో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగారు. 33 ఏళ్లకే పొట్టి ఫార్మాట్ సారథిగా ఎంపికయ్యారు. టీ20ల్లో ఏకంగా 4 సెంచరీలు బాది సత్తా చాటారు. రెండు సార్లు టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచారు.
HAPPY BIRTH DAY SKY